– జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
నవతెలంగాణ- అర్వపల్లి
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఆంగోతు లక్ష్మణ్ మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. గురువారం ఆంగోతు లక్ష్మణ్ భౌతికకాయాన్ని సందర్శించి పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత భూమి భుక్తి వెట్టిచాకురు విముక్తి కోసం మలు స్వరాజ్యం భీమిరెడ్డి నరసింహారెడ్డి తో కలిసి ప్రజలను చైతన్యపరిచి ఎర్రజెండా చేతపట్టి ముందుకు నడిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతాల మీద నిలబడి మొదటి నుండి చివరి వరకు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా పార్టీని వీడలేదనిన్నారు. సిపిఎం ముద్దుబిడ్డగా ఈ ప్రాంత ప్రజల కోసం కృషి చేసిన వ్యక్తిగా లక్ష్మణ్ స్థిరకాలం పేద ప్రజల గుండెల్లో ఉంటాడని ఆయన ఆశయ సాధన కోసంపార్టీ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు జిల్లా కమిటీ సభ్యుడు బుర్ర శ్రీనివాసు మండల కార్యదర్శిలు వజ్జే శ్రీను కడియం కుమార్ కొత్తగట్టు మల్లయ్య నాయకులు ఐలయ్య సిగ వెంకన్న అబ్బులు సైదులు వజ్జే వినరు రాజ్ కుమార్ వెంకన్న ఆదమ్మ పాల్గొన్నారు.