భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు.. పీసీరే చిరస్మరణీయుడు

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్టికల్ కెమిస్ట్రీ విభాగంలో భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు పిసీరే 161జన్మదినాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వాసం చంద్రశేఖర్ పీసీరే భారతదేశ రసాయన శాస్త్రానికి మూల స్తంభంగా భూమిక పోషిస్తూ భారతదేశ రసాయన శాస్త్రానికి దిక్సూచిగా నిలిచారని కొనియడారు. డాక్టరు మావురపు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పీసీరే భారతదేశం నుండి ఏడెన్బర్గ్ యూనివర్సిటీకి వెళ్లి అక్కడ అనేక రసాయన శాస్త్ర పరిశోధనలు నిర్వహించి ఆ ఫలాలను భారతదేశానికి అందించిన ఘనత పిసి రేకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫార్మాస్టికల్ కెమిస్ట్రీ విద్యార్థులు పిసిరే పరిశోధనలు ఆధునిక రసాయన శాస్త్ర అభివృద్ధికి ఏ విధంగా భూమిక పోషించిందో పోస్టర్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీక్ కన్సల్టెంట్ డాక్టర్ అపర్ణ, నర్సయ్య, రమ్య, డాక్టర్ రామేశ్వర్ రెడ్డి, గోపిరాజు, డాక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love