– జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన టియుడబ్ల్యూజే నాయకులు
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
మూడో విడత అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలని టియుడబ్ల్యు జె (ఐజెయు)జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డినీ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్ మాట్లాడుతూ గతంలో రెండుసార్లు జిల్లా సమావేశం నిర్వహించి జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌్ కార్డ్స్ పంపిణీ చేశారు. ప్రజాపక్షం, క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ తదితర దినపత్రికలలో ఇంకా కొందరికి అక్రిడేషన్ కార్డులు రావాల్సి ఉందని ప్రజాపక్షం దినపత్రిక బిగ్ పేపర్ క్యాటగిరిలో ఉన్నదని తెలంగాణలో వికారాబాద్ జిల్లా తప్ప మిగిలిన జిల్లాలన్నిటిలలో బిగ్ పేపర్ కింద రిపోర్టర్లు అక్రిడిటేషన్ కార్డ్స్ పొందారని అన్నారు. వికారాబాద్ జిల్లాలో కూడా మండలాల వారిగా పనిచేస్తున్న అర్హులైన రిపోర్టర్లందరికీ అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలని కోరారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలో మూడవ విడత అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పి. చుక్కయ్య, ప్రజాపక్షం దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ సమ్మని రవీందర్, రిపోర్టర్లు రవీందర్, ప్రశాంత్, ప్రవీణ్, లాల్ బహుదూర్ శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.