ప్రముఖ శాస్త్రీయ సంగీత సంస్థ రామానుజ కళా సాంస్కృతిక నైపుణ్యాభి వృద్ధి సంస్థ నిర్వ్యహణ లో శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన వేదిక పై వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి జయంతి పురస్కరించుకుని ఆయన విరచిత పంచ రత్న కీర్తనలు గోష్ఠి గానం హృద్యం గా జరిగింది. శాస్త్రీయ సంగీత గాయకులు డాక్టర్ వైద్యనాధన్ నిర్వ్యహణ లో గోష్ఠిగానం జరుగగా విఖ్యాత మృదంగకళాకారుడు డాక్టర్ ఎల్లా వెంకటేశ్వర రావు శిష్యులు డాక్టర్ డీ.ఎస్.ఆర్. మూర్తి బృంద మృదంగ లయ విన్యాసం, హేమ బృందం వీణా వాదనం శ్రోతలను పులకితుల చేసాయి. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా సివిల్ సర్వీస్ విశ్రాంత అధి కారి చక్రవర్తి,సంగీత విదూషి డాక్టర్ హరి ప్రియ పాల్గొని ఎల్లా వెంకటేశ్వర రావు ను సత్కరించి మాట్లాడుతూ ఎల్లలు దాటిన మృదంగ విన్యాస ప్రావీణుడు ఎల్లా అని కొనియాడారు. విజ్ఞాన సమితి అధ్యక్షుడు సూరి వెంకటేశ్వరులు, కళా సాగరం అధ్యక్షుడు నారాయణ్ పాల్గొన్న కార్య క్రమానికి సంస్థ స్థాపకుడు అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు
త్యాగరాజ స్వామి కీర్తనలు గోష్ఠి గానం
నవతెలంగాణ – హైదరాబాద్