చాలా మంది బట్టలు ఉతకడానికి తప్ప వాషింగ్ మెషీన్‌ను పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల దుమ్ము ధూళి, మురికి పేరుకుపోయి త్వరగా పాడవుతుంది. అలా కాకుండా వాషింగ్ మెషిన్ ఎక్కువ రోజులు మన్నిక రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కప్పు వెనిగర్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఆ మిశ్రమాన్ని వాషింగ్ మెషీన్ డిటర్జెంట్ బాక్స్‌లో వేసి, బట్టలు వేయకుండా ఉత్తదే 5- 10 నిమిషాల పాటు రన్ చేసి ఆఫ్ చేయాలి. వాటర్ డ్రై అయిన తర్వాత శుభ్రమైన క్లాత్ తీసుకుని లోపల డ్రమ్ తుడవాలి.
ఫ్రంట్ డోర్ వాషింగ్ మెషిన్లు అయితే డోర్ వద్ద ఆగిన నీటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత డోర్ ఓపెన్ చేసి కాసేపు అలా వదిలేయాలి. ఇలా చేస్తే పాచి పట్టకుండా ఉంటుంది.
డిటర్జెంట్ బాక్స్‌లో ఇరుక్కుపోయిన వాషింగ్ పౌడర్ అచ్చుగా ఉంటుంది. కొన్ని రకాల పురుగులు కూడా చేరతాయి. సాధ్యమైతే, మొత్తం సొరుగును బయటకు తీసి, ఒక పాత టూత్ బ్రష్‌తో శుభ్రం చేసుకోవాలి.
ఫిల్టర్‌ను అన్ బ్లాక్ చెయ్యాలి. దీనిలో కూడా పురుగులు ఎక్కువ జమవుతాయి. దీనిని ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచాలి. లోపలి చెత్త, మురికిని తీసేయాలి.
వాషింగ్ మెషిన్‌ను గోడకు దగ్గరగా పెట్టకూడదు. దీని వల్ల వెనక ఉండే పైపులు దెబ్బతింటాయి.
వాషింగ్ మెషిన్ పైపులు లీకేజీ లేకుండా చూసుకోవాలి. మెషిన్లకు పౌడర్లకు బదులు లిక్విడ్ డిటర్జెంట్లు వాడటం మంచిది.
బట్టలు ఉతికిన తర్వాత డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. దీని వల్ల లోపల తేమ పోయి పొడిగా మారుతుంది. దీని వల్ల బ్యాక్టీరియా వద్ధి చెందకుండా ఉంటుంది.