చెట్టు

పచ్చదనమే ప్రగతికి ప్రమాణం,
ఎండిన చెట్టు దుర్గతికి చిహ్నం.

చెట్లే జన జీవనానికి
అందించును ఆహ్లాదం,
కలిగించు ఆరోగ్యం..
భావి తరాలకు మూలధనం
మనిషి జీవనంకు అవే
ప్రాణాధారం!

చెట్టు పచ్చగా ఉంటేనే
మన బ్రతుకు పచ్చదనం,
చెట్టు ఎండి-మోడైతే
మన బతుకు దుర్బరం!

చెట్టు పై వేయకు వేటు
అది నీకే కల్గించు చేటు,
ప్రకృతిలో చెట్టు
ప్రగతికి మెట్టు!

మనకు పండును,
ప్రాణ వాయువును
అందించేను చెట్టు!
పచ్చదనంపంచే చెట్టు..
ప్రగతికి మెట్టు..!!
– ఎన్‌.రాజేష్‌

Spread the love