అసలేట్ల ముసలి ఎద్దు రంకె ఏస్తది

‘అసలేటి కార్తెల ముసలి ఎడ్లు రంకె ఏస్తయి’ అంటే వృద్ధాప్యంలో నున్న పశువులు కూడా రంకె వేస్తయి అన్నట్టు. ఎందుకంటే అంతకుముందు మూడు నాలుగు కార్తెల ముందే అంటే మృగశిర, పునర్వసు, పుష్యమి లలో వర్షాలు పడడం వల్ల గరుక పెరిగి బగ్గ తిని వుంటయి. అసలేరు అంటే ఆశ్లేష కార్తె అన్నట్టు. అప్పుడు జబర్‌దస్త్‌గా వుంటాయని వాడుతరు. చాంద్రమాన కాలం ప్రకారం 27 నక్షత్రాలు వుంటయి. వీటినే వ్యవసాయదారులు కార్తెలుగా పిలుచుకుంటారు. కార్తె కార్తెకూ సామెతలు పెట్టి అన్వయిస్తరు. అట్లనే ‘అశ్వినిల కురిస్తే అంతా నష్టం. అప్పుల పాలు’ అంటరు. అశ్విని అంటే ఏప్రిల్‌ నెలలో వస్తది. నడి ఎండాకాలం అన్నట్టు. అట్లనే ‘రోణిల రోకండ్లు పగిలే ఎండలు’ అంటరు. రోణి అంటే రోహిణి కార్తె. మే నెలలో వస్తది. ఎండలు దంచుతయి. ఇది మృగశిర కార్తె. మృగశిర ను పల్లెల్లో ముర్కశిల, మిర్గం అని కూడా అంటరు. ప్రాంతానికో పేరుతో పిలుస్తరు. ‘పుష్యమిలో కురిస్తే పూరెడు పిట్ట కూడా తడవది’ అంటరు. అంటే జులై మాసం వానలు అసలు పడయి అన్నట్టు. ఉత్తర కార్తె అయితే ‘ఉత్తర ఉరిమి ఉరిమి కొడితే పాములు తరిమి తరిమి కొడుతయి’ అంటరు. సెప్టెంబర్‌ లో కూడా వర్షాలు ఉరుములు మెరుపులతో కొడుతయి. వ్యవసాయం కాలాలతో సంబంధం వుండడం వల్ల నైరుతి రుతుపవనాలు ఏ కార్తెలో వస్తయి అని నిపుణులు అంచనాలు వేసె. ఏ కార్తెలు ఎప్పుడు వస్తయి, ఎప్పుడు వర్షాలు కురుస్తయి అనే లెక్కలతోనే వుంటరు. వ్యవసాయ వృత్తిదారులు జనవరి, ఫిబ్రవరి మాసాలతో పిలుచుకున్నా పూర్వం కార్తెలతోనే మాట్లాడుకునేది. కార్తెలల్ల చిత్త కార్తె వుంటది. ఈ కార్తెలో మాత్రమే కుక్కలు సంపర్కం చెందుతయి. జీవ పరిణామంలో కాలానుగుణం కొన్ని ఏర్పడ్డయి. అవి అలాగే కొనసాగుతున్నయి. ‘స్వాతి కార్తెలో చినుకు పడితే ముత్యం’ అంటరు. అట్లనే ‘ఆరుద్రలో అడ్డెడు సల్లుతే పుట్టెడు పండుతయి’ అంటరు. కొందరి చర్యలను చూసి వాని కత అంత ‘మఖల పుట్టి పుగల పోతది’ అంటరు. అంటే నెలలోపే పని అయిపోతదన్నట్టు. జానపదులు, సృజనకారులు ఒకింత అనుభవ శాస్త్రవేత్తలు కూడా
. – అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love