నవతెలంగాణ – అహ్మదాబాద్: ఐపీఎల్లో ఐదు టైటిళ్లు నెగ్గి అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు రెడీ అయింది. లీగ్ దశలో ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ముందడుగు వేసిన ముంబై.. లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. అదే జోరులో శుక్రవారం జరుగనున్న క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. బలాబలాల పరంగా చూసుకుంటే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో లీగ్ దశను ముగించిన హార్దిక్ సేన.. తొలి క్వాలిఫయర్‌లో చెన్నై చేతిలో ఓడిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్‌కు సొంతగడ్డపై ఆడనుండటం సానుకూలాంశం.