ధోనీ ఖాతాలో మరో రికార్డు

నవతెలంగాణ – చెన్నై
చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ మరో ఘనత సాధించాడు. ఇప్పటికే ఐదు ఐపీఎల్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న ధోనీ 250 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇందులో ఎక్కువగా సీఎస్‌కే తరఫున ఆడిన ధోనీ రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌కూ ప్రాతినిధ్యం వహించాడు. ధోనీ తర్వాత రోహిత్ శర్మ 243 మ్యాచ్‌లు, దినేశ్‌ కార్తిక్ 377 మ్యాచ్‌లతో కొనసాగుతున్నారు. ఐదు టైటిళ్లను గెలిచిన సారథిగా రోహిత్‌ను ధోనీ సమం చేశాడు. గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్‌కే ఐదు వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతి ప్రకారం) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 214/4 స్కోరు చేసింది. వర్షం కారణంగా టార్గెట్‌ను 15 ఓవర్లకు 171 పరుగులకు కుదించారు. ఓపెనర్ డేవన్ కాన్వే (47: 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుతమైన ఆటతో సీఎస్‌కే గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతడికే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.

Spread the love