బజాజ్‌ ఫైనాన్స్‌తో టయోటా కిర్లోస్కర్‌ ఒప్పందం

బెంగళూరు : బజాజ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) వెల్లడించింది. టయోటా వాహనాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను మరింత సౌకర్య వంతంగా, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి, మెరుగైన రిటైల్‌ ఫైనాన్స్‌ ఎంపికలను అందించడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేయనుందని తెలిపింది. బజాజ్‌ ఫినాన్స్‌ తమ ఖాతాదారులకు సమగ్ర ఆర్థిక పరిష్కారాలను అందించడానికి ముందుకు వచ్చిందని వెల్లడించింది. దేశంలోని 89 కీలక ప్రదేశాలలో ఫినాన్సింగ్‌ సేవలను అందించనుందని పేర్కొంది.

Spread the love