సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ – ఆస్కీ, టీ హబ్‌ ఒప్పందం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వివిధ రంగాల్లో పని చేస్తున్న వారి సామర్థ్యాన్ని పెంచేందుకు అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ), టీ-హబ్‌ ఒప్పందంపై సంకతం చేశాయి. మంగళావారం హైదరాబాద్‌లోని అస్కీలో నిర్వహించిన కార్యక్రమంంలో ఇరు సంస్థలకు చెందిన అధికారులు ఉన్నారు. ఏకో సిస్టమ్‌లో సహకారాన్ని ప్రోత్సహించేందుకు, సాంకేతిక టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌ కంపెనీలకు మద్దతు తెలిపేందుకు, సమగ్ర పర్యావరణ వ్యవస్థను రూపొందించడం తదితర అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్కీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నిర్మల్య బాగ్చి, టీహబ్‌ సీఈవో ఎం శ్రీనివాస్‌రావు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఇరు సంస్థల అధికారులు పాల్గొన్నారు.

Spread the love