ఏపీలో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

నవతెలంగాణ-హైదరాబాద్ :  ఏపీలో మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు అధికారులకు ఎన్నికలతో సంబంధంలేని విధులు అప్పగించాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించాలని సూచించింది.

Spread the love