గాజాపై ఐరాస తీర్మానం

– ఓటింగ్‌కు భారత్‌ దూరం
న్యూయార్క్‌: గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల మండలి తీర్మానం చేసింది. అయితే ఆ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ఇండియా పాల్గొనలేదు. గాజా స్ట్రిప్‌లో ఉన్న అక్రమ నిర్బంధాన్ని కూడా ఎత్తివేయాలని ఇజ్రాయిల్‌ను ఆ తీర్మానంలో కోరారు. తీర్మానానికి అనుకూలంగా 28 ఓట్లు పోలయ్యాయి. ఆరుగురు వ్యతిరేకంగా ఓటేశారు. 13 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఇండియాతో పాటు ఫ్రాన్స్‌, జపాన్‌, నెదర్లాండ్స్‌, రొమేనియా దేశాలు కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు. వ్యతిరేకంగా ఓటు వేసిన దేశాల్లో అర్జెంటీనా, బల్గేరియా, జర్మనీ, అమెరికా ఉన్నాయి. అనుకూలంగా ఓటేసిన దేశాల్లో బంగ్లాదేశ్‌, బెల్జియం, బ్రెజిల్‌, చైనా, ఇండోనేషియా, కువైట్‌, మలేషియా, మాల్దీవులు, ఖతార్‌, సౌత్‌ ఆఫ్రికా, యూఏఈ, వియత్నాం ఉన్నాయి.

Spread the love