– మరో రెండు రోజుల పాటు వైద్య శిభిరం కొనసాగింపు
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డ్ అద్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిభిరానికి అపూర్వ స్పందన లబించింది.మంగళవారం జనాగం జిల్లా కార్మిక శాఖాధికారి ర్యాకం కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ సర్పంచ్ సీత లక్ష్మితో కలిసి ఉచిత వైద్య శిభిరాన్ని ప్రారంభించారు.బుధ,గురువారం వరకు ఉచిత వైద్య శిభిరాన్ని కొనసాగిస్తారని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డీఎల్ఓ కుమార్ సూచించారు.ఉప సర్పంచ్ తిరుపతి,వార్డ్ సభ్యలు, పీఏసీఎస్ డైరెక్టర్ సీత భూమయ్య,సీఎస్సీ వైద్య సిబ్బంది హజరయ్యారు.