విజయం ‘ఇండియా’ కూటమిదే!

విజయం 'ఇండియా' కూటమిదే!లోక్‌సభకు రెండువిడతల్లో 190 సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి.ఈ రెండు ఫేసులలోను ఇండియా బ్లాక్‌ భాగస్వామ్య పక్షాలదే పై చేయిగా స్పష్టమైన సంకేతాలు దేశ ప్రజలకు అందాయి. దీంతో మోడీ, బీజేపీ నాయకులకు వణుకు ప్రారంభమైంది. అందుకే రాజస్థాన్‌ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి స్థాయిలో మోడీ రాజ్యాంగ వ్యతిరేక, ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకమైన, మతపరమైన పోలరైజేషన్‌ కోసం విద్వేష వ్యాఖ్యలు చేశారు.అయినా ఎన్నికల కమిషన్‌ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నది. కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉండి దేశ సంపదను కాజేస్తున్నది, దోచిపెడుతున్నది ఎవరికో దేశ ప్రజలు గమనిస్తునే ఉన్నారు. మేమిద్దరం (మోడీ, అమిత్‌ షా) మాకిద్దరు (ఆదానీ, అంబానీ) అనే నానుడి స్థిరపడేలా వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా వివిధ రూపాల్లో కార్పొరేట్లకు అప్పజెప్పారు. బిలియ నీర్ల సంఖ్య 2014 నుంచి 2024 నాటికి నాలుగు రెట్లు పెరిగింది. భారత దేశ స్థూల జాతీయాదాయం 2022 సంవత్సరం రూ.270 లక్షల కోట్లలలో పై ఒకశాతానికి చేరిన ఆదాయం 22.6 శాతం. ఇది బ్రిటిష్‌ పరిపాలన కాలం కన్నా అదనం. అదే సమయంలో అట్టడు గు 50శాతం భారతీయులు పొందిన ఆదాయం 1951లో 20.6 శాతం ఉండగా 2022కు 15శాతం తగ్గింది.
2024 సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటికి ఉన్న దేశ రాజకీయ పరిస్థితికి నేడు మారింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల బాండ్స్‌ బహిర్గతం చేసిన తర్వాత, లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో స్పష్టమైన మార్పు దేశ ఎన్నికల రాజకీయ రంగంలో కనబడుతున్నది. అవినీతిపరుల అడ్డాగా బీజేపీ మారి పోయిందని, వివిధ పార్టీలలోని అవినీతి పరులందర్నీ బీజేపీలోకి వారి నాయకత్వం చేర్చుకుంటున్నదని, ఈడీ, సిబిఐ, ఐటిలు బీజేపీ జేబు సంస్థలుగా మారిపోయా యని ప్రజలు భావిస్తున్నారు. ‘యువత, మహిళలు, రైతులు, పేదలే మా లక్ష్యం’ అంటున్నది బీజేపీ. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సృష్టి ఏమోగానీ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలనే భర్తీ చేయలేదు. మహిళలలో పౌష్టికాహార లోపం, రక్తహీనత పెరిగింది. మహిళలపై నేరాలు పెరిగాయి. మణిపూర్‌లో జరిగిన దాడులు, రెజ్లర్ల పై తమ ఎంపీ బ్రిజుభూషణ్‌ వేధింపులపై ఇంతవరకు మోడీ ఒక్కమాటైనా మాట్లాడలేదు. రైతు ఆదాయం రెట్టింపు కాలేదు. కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించలేదు. రైతు ఉద్యమంపై ఉక్కు పాదం మోపారు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపెట్టను న్నది. మరోవైపు ఈ వర్గాల సమస్యలను అడ్రస్‌ చేస్తూ.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తులు కుదుర్చుకుంటూ ఇండియా బ్లాక్‌ ముందుకెళ్తున్నది. బీహార్‌లో ఆర్జెడీ, కాంగ్రెస్‌, వామపక్షాలు మహారాష్ట్రలో ఉద్దవ్‌ఠాక్రే శివసేన, శరద్‌పవర్‌ ఎన్సీపీ కాంగ్రెస్‌ ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఢిల్లీ, గుజరాత్‌, గోవా రాష్ట్రాలలో ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య ఎన్నికల ఒప్పందం కుదిరింది.రాజస్థాన్‌ 2023 అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా వామపక్షాలు, ఇతర మిత్రపక్షాలతో కాంగ్రెస్‌ పొత్తులు లోక్‌సభ ఎన్నికలలో సీపీఐ (ఎం), రాష్ట్రీయ లోక్‌ తాంత్రిక పార్టీ, భారత ఆదివాసి పార్టీలతో కాంగ్రెస్‌ ఒప్పందం చేసుకున్నది. ఇటీవల వరకు బీజేపీకి మద్దతుగా నిలిచిన రాజ్‌పుట్స్‌ పై కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల నోటిదురదతో ఆ వర్గంపై చేసిన కామెంట్స్‌ పై భగ్గుమంటున్నారు. రూపాలకు కేటాయించిన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఉపసంహరించుకోవాలని గత పది రోజులుగా ఆందోళనలు కొనసాగు తున్నాయి. రాజ్‌పుట్స్‌ ప్రభావం గుజరాత్‌, రాజస్థాన్‌, పశ్చిమ యూపీ, హర్యానాలో తీవ్రంగా ఉండనున్నది. భాగస్వామ్య పక్షాలు ఎన్నికల అలయన్స్‌, ప్రజల నిజ జీవిత సమస్యల పరిష్కార ఎన్నికల ప్రణాళికతో ఇండియా బ్లాక్‌ ఎన్నికల సమరంలో దూసుకుపోతుంటే ఎన్డీయే మరోసారి ప్రజలను మోసం చేస్తూ, విద్వేషాలు రగిలిస్తూ, కార్పొరేట్‌ మీడియా మద్దతుతో ఎలాగైనా మరోసారి గద్దెనెక్కా లని మోడీ,షా ద్వయం ప్రయత్నిస్తున్నది.
మన రాష్ట్రం విషయానికొస్తే ఎన్నికల సందర్భంగా చర్చ ఐదు నెలల కాంగ్రెస్‌ పాలనపై జరగాలా? పదేండ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారనే అంశంపై చర్చ జరగాలనా? ఎన్నికలు జరుగు తున్నవి పార్లమెంటుకు. మోడీ ఎత్తుగడల మాయలో పడిపోయిన బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తే, కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసుకుంటూ బీజేపీ రాష్ట్ర, దేశ వ్యతిరేక విధానాలను విస్మరిస్తున్నది. 2019 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు ఎంపీ సీట్లను బీజేపీకి ఇస్తే ఈ ఐదేండ్ల కాలంలో రాష్ట్రానికి కేంద్రం చేసింది గుండు సున్నా. రాష్ట్ర విభజన హామీలను విస్మరించింది. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ లేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమకు అనుమతి లేదు. ఐటిఐఆర్‌ ప్రాజెక్టును ఆటకెక్కిం చింది. త్రిపుల్‌ ఐటిని ఇతర రాష్ట్రాలకు ఇచ్చింది. కాళేశ్వరం లేదా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలన్న రాష్ట్ర ప్రజల డిమాండ్‌ను కేంద్రం అంగీకరిం చడం లేదు. ఇలా చెప్పుకుంటూ అసలు సమస్యల్ని పక్కదారి పట్టిస్తూ హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు పెంచి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోంది మోడీ ప్రభుత్వం. కానీ లౌకికవాదాన్ని బలపరుస్తున్న ప్రజాస్వామిక వాదులు, విద్యావంతులు, మేధావులు ఇండియా బ్లాక్‌ దే విజయమని గట్టిగా చాటుతున్నారు.
గీట్ల ముకుందరెడ్డి 9490098857

Spread the love