విశ్వంభర లో విజయశాంతి..?

నవతెలంగాణ – హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకుడు.  ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రను విజయశాంతి చేస్తే బాగుంటుందని మూవీ టీం భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయశాంతిని సంప్రదించినట్టుగా తెలుస్తోంది. గతంలో చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్లో కొన్ని సూపర్ హిట్స్ చిత్రాలు వచ్చాయి. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈ ఇద్దరినీ ఒకే తెరపై ప్రేక్షకులు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, జనవరి 10వ తేదీన విడుదల కానుంది.

Spread the love