జీపీ కార్మికులకు వేతనాలు చెల్లించాలి

– సీఐటీయూ మండల కన్వీనర్‌ పోచమోని కృష్ణ
– లోయపల్లిలో 2వ రోజుకు చేరిన గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
లోయపల్లి గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ మండల కన్వీనర్‌ పోచమోనీ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్ర వారం మండల పరిధిలోని లోయపల్లి గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సీఐటీయూ ఆధ్వర్యంలో సం ఘీభావం తెలిపిన సందర్భంగా ఆయన మాట్లా డుతూ..మంచాల మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు నెలనెల ఇవ్వకపో వడం తో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా లోయపల్లి గ్రామపం చాయతీ కార్మికులకు 6 నెలల నుండి వేతనాలు ఇవ్వకపో వడం ఏమిటని ప్రశ్నించారు. కొన్నేండ్లుగా చాలీ చాలని జీతాలతో జీవనం గడుపుతున్నారని, వారికి వచ్చే అరకొర వేతనాలు కూడ నెలనెలకు ఇవ్వకపోతే జీవనం గడిచేది ఎలా అన్నారు. పాలకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలించే పద్ధతి మారడం లేదని కార్మికుల సమస్యలను పట్టించుకునే ప్రభుత్వం అధికారం లోకి రావడం లేదన్నారు. కాబట్టి ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిచో లోయపల్లి గ్రామం నుండి కలెక్టర్‌ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామని మండల వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు చెల్లించాలని కోరుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు గ్రామ పంచాయతీ నిధులన్నీ కాంట్రాక్టర్లుకు ఇచ్చి గ్రామ పంచాయతీ కార్మికులను మా త్రం ఆకలకి చంపుతున్నారన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మి కులు కృష్ణ, హీరాలాల్‌, ఎల్‌.రవి, డి.కుమార్‌, సాలమ్మా, పీ.రమేష్‌, లచ్చు, రాములమ్మ, సత్తయ్య, సరిత, ఆగమ్మా, వనజ తదితరులున్నారు.

Spread the love