Sunday, June 28, 2026
E-PAPER
Homeనెమలీకమనమంతా ఒక్కటే

మనమంతా ఒక్కటే

- Advertisement -

యమునా నదీ తీరం లో వున్నా ఓ చిన్న వనం అది. అక్కడ పెద్ద పెద్ద చెట్లు తో పాటు దానిమ్మ, బత్తాయి, నారింజ, జామ లాటి మొక్కలు వున్నాయి. అప్పుడే సాయం సంధ్యా సమయం అవుతోంది. పక్షులు ఒక్కొక్కటిగా గూటికి చేరుకుంటున్నాయి. మందారం అనే పిచ్చుక చెదిరిన తన గూడు సరి చేసుకుంటోంది. పక్కనే కొమ్మ మీద వున్నా కాకి ” ఓ మందారం ఎప్పుడు ఎదో పనేనా ఒక్కసారైనా మాతో మాట్లాడేది ఉందా!” అంది. ”ఎందుకు మాట్లాడను చీకటి పడుతోంది అని గూడు బాగు చేసుకుంటున్నా!” అంది. ”ఆ పొట్టి ముక్కుతో ఏం పనిచేస్తావులే” అంది కాకి వెటకారంగా. ఆ పక్క నున్న ముసలి గ్రద్ద ”కాకమ్మా ఎవరి అవసరాన్ని బట్టి ఈ సష్టిలో శరీరాలు ఏర్పడ్డాయి. మందారం చిన్నది కనుక దాని ముక్కు కూడా చిన్నదే. అదే ఆ కొంగని చూడు చేపలు పట్టేందుకు వీలుగా పొడవైన మెడ అలాగే పొడవైన ముక్కు.

ఇక ఈ చిలుకమ్మ కాయలు పండ్లు కోరికేందుకు వీలుగా దాని ముక్కు వంకరిగా కొనదేరి వుంటుంది.” అంది. ”ఏమిటీ ముక్కుల గోల” అంటూ కాకి వంక చూసింది వడ్రంగి పిట్ట, అదా సంగతి, కాకమ్మ ముక్కుకి ముక్కెర పెట్టింది అందుకే ముక్కు గురించి మాట్లాడడం మొదలు పెట్టింది.” అంది. అన్ని పక్షులు కాకి వంక చూసాయి. కాకి మరింత వయ్యారం పోతూ ముక్కు అటు ఇటు తిప్పింది. ఆ హడావిడిలో దాని ముక్కెర కిందనున్న పుల్లల మద్యన పడి పోయింది. అయ్యో అని కాకి బాధ పాడడం చూసి , మందారం ఆ పుల్లల మద్యన దూరి ఆ ముక్కెర తెచ్చి ఇచ్చింది. నిన్ను అనవసరంగా మాటలన్నాను నన్ను క్షమించు మందారం. నేనైతే ఆ పుల్లల మద్యన దూరలేను” అంది కాకి. ఒకరికి ఒకరు సహాయం, చేసుకోవడంలో మనమంతా ఒకటే అంది ముసలి గ్రద్ద. అన్ని సంతోషించాయి.

– కూచిమంచి నాగేంద్ర, 9182127880

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -