స్వాగతిస్తున్నాం

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌ స్వాగతిస్తున్నాం నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో కులగణనపై అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టిన బిల్లును స్వాగతిస్తూ, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కే తారకరామారావు (కేటీఆర్‌) అన్నారు. 2004లో కేంద్ర మంత్రి హౌదాలో తమపార్టీ అధినేత కేసీఆర్‌ ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోరారని గుర్తుచేశారు. దీనిపై రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామన్నారు. అయితే బీహార్‌ తరహాలో న్యాయసమస్యలు తలెత్తకుండా, బిల్లు రూపొందించి, చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనికోసం జ్యుడీషియరీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ 2011లో చట్టం చేయకుండానే కులగణన జరిగిందనీ, చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలని అన్నారు. 2014లో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఇప్పటి వరకు బయటపెట్టలేదని గుర్తుచేశారు. 2014 నుంచి 2023 వరకు తొమ్మిదిన్నరేండ్లలో బీసీల కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం రూ.23వేల కోట్లు అని చెప్పారు. ఎమ్‌బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దానికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల్లో కులగణనపై చట్టం చేయలేదనీ, ఎక్కడా న్యాయస్థానాలు స్టే విధించలేదని చెప్పారు. ఇదే అంశంపై సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కులగణనపై విస్త్రుత చర్చ కోసం అఖిలపక్షాన్ని పిలవాలనీ, దానిలో బీసీ సంఘాలకూ ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. దేశంలో కార్పొరేట్‌ రంగం విస్తరించి, ప్రభుత్వ రంగం కుదించుకుపోతున్నదనీ, ఈ దశలో కులగణన ద్వారా జనాభా ప్రాతిపదికన ఎవరి వాటాలు ఎంతో తేల్చాల్సి ఉంటుందన్నారు. అదే సందర్భంలో క్రిమీలేయర్‌పై కూడా చర్చ జరగాలన్నారు. తీర్మానాన్ని బిల్లు రూపంలో తేవాలనీ, ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికగా నిర్ణయాలు జరగాలని చెప్పారు. అదే సమయంలో ఓసీల ఆర్థిక స్థితిగతుల్నీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బీజేపీ సభ్యులు పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ బీసీ జనగణనకోసం కమిషన్‌ ఏర్పాటు చేయాలనీ, చర్చించేందుకు అసెంబ్లీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలపై అసెంబ్లీలో తీర్మానాలు చేయలేదనీ, పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు భావించాల్సి వస్తుందన్నారు. 2014 ఆగస్టులో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందని ప్రశ్నించారు. ముస్లింల ఆర్థిక స్థితిగతులపై గతంలో సచార్‌ కమిషన్‌, రంగనాథ్‌ కమిషన్లు అనేక నివేదికలు ఇచ్చాయనీ, వాటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. చిత్తశుద్ధితో కులగణన చేపడితే తొలుత న్యాయసలహా తీసుకోవాలని సూచించారు. కులగణన జరిగాక ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇదే అంశంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, కాంగ్రెస్‌ సభ్యులు కే శంకర్‌, వాకాటి శ్రీహరి తదితరులు మాట్లాడారు. అనంతరం సభ్యుల సందేహాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమాధానాలు ఇచ్చారు. సభ్యుల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తీర్మానానికి ఆమోదం తెలపాలని కోరారు. అనంతరం స్పీకర్‌ ప్రసాదరావు తీర్మానం ఆమోదం పొందినట్టు ప్రకటించారు. – అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కులగణనపై అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టిన బిల్లును స్వాగతిస్తూ, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కే తారకరామారావు (కేటీఆర్‌) అన్నారు. 2004లో కేంద్ర మంత్రి హౌదాలో తమపార్టీ అధినేత కేసీఆర్‌ ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోరారని గుర్తుచేశారు. దీనిపై రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామన్నారు. అయితే బీహార్‌ తరహాలో న్యాయసమస్యలు తలెత్తకుండా, బిల్లు రూపొందించి, చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనికోసం జ్యుడీషియరీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ 2011లో చట్టం చేయకుండానే కులగణన జరిగిందనీ, చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలని అన్నారు. 2014లో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఇప్పటి వరకు బయటపెట్టలేదని గుర్తుచేశారు. 2014 నుంచి 2023 వరకు తొమ్మిదిన్నరేండ్లలో బీసీల కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం రూ.23వేల కోట్లు అని చెప్పారు. ఎమ్‌బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దానికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల్లో కులగణనపై చట్టం చేయలేదనీ, ఎక్కడా న్యాయస్థానాలు స్టే విధించలేదని చెప్పారు. ఇదే అంశంపై సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కులగణనపై విస్త్రుత చర్చ కోసం అఖిలపక్షాన్ని పిలవాలనీ, దానిలో బీసీ సంఘాలకూ ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. దేశంలో కార్పొరేట్‌ రంగం విస్తరించి, ప్రభుత్వ రంగం కుదించుకుపోతున్నదనీ, ఈ దశలో కులగణన ద్వారా జనాభా ప్రాతిపదికన ఎవరి వాటాలు ఎంతో తేల్చాల్సి ఉంటుందన్నారు. అదే సందర్భంలో క్రిమీలేయర్‌పై కూడా చర్చ జరగాలన్నారు. తీర్మానాన్ని బిల్లు రూపంలో తేవాలనీ, ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికగా నిర్ణయాలు జరగాలని చెప్పారు. అదే సమయంలో ఓసీల ఆర్థిక స్థితిగతుల్నీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బీజేపీ సభ్యులు పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ బీసీ జనగణనకోసం కమిషన్‌ ఏర్పాటు చేయాలనీ, చర్చించేందుకు అసెంబ్లీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలపై అసెంబ్లీలో తీర్మానాలు చేయలేదనీ, పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు భావించాల్సి వస్తుందన్నారు. 2014 ఆగస్టులో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందని ప్రశ్నించారు. ముస్లింల ఆర్థిక స్థితిగతులపై గతంలో సచార్‌ కమిషన్‌, రంగనాథ్‌ కమిషన్లు అనేక నివేదికలు ఇచ్చాయనీ, వాటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. చిత్తశుద్ధితో కులగణన చేపడితే తొలుత న్యాయసలహా తీసుకోవాలని సూచించారు. కులగణన జరిగాక ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇదే అంశంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, కాంగ్రెస్‌ సభ్యులు కే శంకర్‌, వాకాటి శ్రీహరి తదితరులు మాట్లాడారు. అనంతరం సభ్యుల సందేహాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమాధానాలు ఇచ్చారు. సభ్యుల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తీర్మానానికి ఆమోదం తెలపాలని కోరారు. అనంతరం స్పీకర్‌ ప్రసాదరావు తీర్మానం ఆమోదం పొందినట్టు ప్రకటించారు.

Spread the love