Wednesday, July 22, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ట్రిపుల్ ఐటీ లో ఏం జరిగింది.? 

ట్రిపుల్ ఐటీ లో ఏం జరిగింది.? 

- Advertisement -

విషయం బయటకు రాకుండా అధికారుల ప్రయత్నాలు..
నవతెలంగాణ – ముధోల్
బాసర ట్రిపుల్ ఐటీ లో బుధవారం మధ్యాహ్నం ఓ ఘటన జరిగినప్పటికీ, ట్రిపుల్ ఐటీ యాజమాన్యం బయటకు రాకుండా గోప్యత పాటించటంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ విద్యార్థి ట్రిపుల్ ఐటీ లోని పై అంతస్తు నుండి దూకినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఈ ఘటన ప్రమాదవశాత్తు, లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా.. అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులు బయటకు పోకుండా జాగ్రత్తలు పాటించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం త్రిబుల్ ఐటీ లో ఏదో ఘటన చోటు చేసుకోవటం, వార్తతో బయట ప్రపంచానికి తెలియడంతో జీర్ణించుకోలేని సంబంధిత అధికారులు ఘటన విషయం మీడియాకు తెలియకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది‌. ఏది ఏమైనా ఈ ఘటనపై త్రిబుల్ ఐటీ అధికారులు స్పందించకపోవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -