దళితులపై వివక్ష ఎందుకు…?

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కనకయ్యను బెదిరింపులకు గురి చేస్తే ఊరుకునేది లేదని దళితులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఎంఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ బొల్లారపు వెంటకరమణ మాదిగా హెచ్చరించారు. అదివారం ఇతరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ యూనివర్సిటీలో క్యాస్ట్ ఫీలింగ్ తో రాజకీయాలు చేస్తున్నారని ఇది ఎంత మాత్రం యూనివర్సిటీకి మంచిది కాదని దళిత సంఘాల నాయకులు వివరించారు. 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా కనకయ్య విధులు నిర్వహించారని, రెండు నెలల వ్యవధిలోని కనకయ్యను తొలగించి ఉన్నత విద్యా కమిషనర్, ఈసీ సభ్యులు రిజిస్ట్రార్ గా యాదగిరిని నియమించారన్నారు. యాదగిరి స్వచ్ఛందంగా వెళ్ళిపోతే బీసీ గౌడ కు చెందిన శివశంకర్ ను నియమించారని, శివశంకర్ పని చేసినంత కాలం ఈసీ సభ్యులుగా ఉన్న గంగాధర్ గౌడ్, మారయ్య గౌడ్, వసుంధర దేవి గౌడ్ లకు ఎందుకు ఈసి సమావేశాలు గుర్తుకు రాలేదని వారు ప్రశ్నించారు. అదే ఓ దళితురాలైన ఎస్సీ కి చెందిన విద్యావర్ధిని నియమిస్తే అమెను సస్పెండ్ చేయాలని తీర్మానించారని ఇది ఎంతవరకు సమంజసం వారు ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండా ఎందుకు ఈసీ నిర్ణయం తీసుకుందని, ఆ తర్వాత మళ్లీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ యాదగిరిని ఎందుకు ప్రపోజ్ చేశారని చెప్పారు. యాదగిరి కి సభ్యులు మద్దతు తెలపడం వెనుక అసలు రహస్యాలు వేరే ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడ తామని హెచ్చరించారు. మరోవైపు యూనివర్సిటీలో రిజిస్ట్రార్ లేక ఇబ్బందులు తలెత్తుతుంటే, కనకయ్యను రిజిస్ట్రార్ గా నియమిస్తే ఎందుకు ఓర్చుకోవడం లేదని వారన్నారు. కనకయ్య వెనకాల ఉండి గౌడ్స్ కు చెందిన ఈసీ సభ్యులు కక్షపూరితంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే ఈసీ సభ్యులు ఉస్మానియా యూనివర్సిటీలోని సత్యనారాయణ ను తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేశారని, అది కుదరకపోవడంతో మళ్లీ యాదగిరిని తెరమీదకి తెచ్చారని వెల్లడించారు. ఇప్పుడు దళితుడైన కనకయ్యను నియమిస్తే మళ్లీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, గంగాధర్ గౌడ్ కనకయ్యకు ఫోన్ చేసి బెదిరించడం వెనక రహస్యం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈసీ తమ పరిధి దాటి ప్రవర్తించకూడదని ఒకవేళ అలా చేస్తే అందుకు తగినట్టుగానే దళిత సంఘాలు స్పందిస్తాయని హెచ్చరించారు. ఇప్పటికైనా ఈసీ సభ్యులు తీరు మర్చుకుని కనకయ్యను రిజిస్ట్రార్ గా కొనసాగించాలని లేదంటే తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని నిర్ణయించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆడెపు అభినయి మాదిగ, ఉదయ్ మాదిగ పాల్గొన్నారు.

Spread the love