నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని కన్నాపూర్ లో ఐదు పోచమ్మ గుడిలను నిర్మించి, ఆదివారం విగ్రహ ఊరేగింపులో భాగంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, జిల్లా పరిషత్ ఫోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవార్లకు తమ వంతుగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి రూ 16,000, మోహన్ రెడ్డి రూ, 2000 ఆలయ కమిటీకి అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి రెడ్డి మహేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.