మణిపుర్‌లో మహిళను కాల్చి చంపిన మిలిటెంట్లు..

ఇంఫాల్‌ : మణిపుర్‌లో మిలిటెంట్లు ఒక మహిళను కాల్చి చంపారు. 24 గంటల్లో వేరు వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న లూసి మారిమ్‌ అనే మహిళపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. కాల్పుల అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఈ ఘటన తూర్పు ఇంఫాలోని కెయిబి హేకాక్‌ మాపాల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కాంగ్‌పోక్పి జిల్లాలోని తంగ్‌బుV్‌ా గ్రామంలో జాంగ్‌ఖోలున్‌ హౌకిప అనే మరోవ్యక్తి బలి అయ్యాడు.

Spread the love