పిల్లలపై అరుస్తున్నారా?

పిల్లలపై అరుస్తున్నారా?మా పాప జి.సరోజారారు యుకేజీ చదువుతున్నప్పుడు ఒకరోజు నేను స్కూలుకి వెళ్ళను అంది. షాకింగ్‌! అరె… ఎంత జ్వరం ఉన్నా… నేను ఒద్దు అన్నా వెళ్ళేది. ఇప్పుడేంటి ఇలా అంటుందని డా.హిప్నో కమలాకర్‌, నేను స్కూలుకి వెళ్ళాం. క్లాస్‌లో కూర్చో అని చెప్పినా ఏడుస్తుంది. సరే అని మేమూ బయట కూర్చున్నాం. లోపల నుంచి టీచర్‌ గట్టిగా అరుస్తూ పాఠం చెపుతుంది. మాకు అర్థమై ప్రిన్సిపాల్‌ దగ్గరకు వెళ్ళి మా పాప సెక్షన్‌ మార్చండి అంటే ఎందుకూ అన్నారు. టీచర్‌ పద్ధతి బాగోలేదని చెప్పాం. ఆ టీచర్‌ చాలా బాగా పాఠాలు చెపుతుంది అన్నారు ప్రిన్సిపాల్‌. ఆవిడ చెప్పేపద్ధతికి పిల్లలకు సమస్యలు వస్తున్నాయని చెప్పి మా పాప సెక్షన్‌ మార్చేసాం. ఒక నెలకు ప్రిన్సిపాల్‌ మాకు ఫోన్‌ చేసి ‘మీరు చెప్పింది నిజమే… ఆవిడ వల్ల చాలా మంది పిల్లలు స్కూల్‌ మానేశారు’ అంది. గట్టిగా అరిచి చెప్పే మాట మెదడులో బలంగా నాటుకుపోతుంది.
పిల్లలపై అరవడం వారిని బాధపెడుతుంది! మీరు మీ చిన్ననాటి రోజులలో మీ తల్లిదండ్రులు అరిచినట్లు గుర్తు చేసుకున్నా, లేదా మీ ఇరుగుపొరుగు తల్లిదండ్రులు తమ పిల్లవాడిని హోంవర్క్‌ చేయనందుకు అరుస్తున్నారని గమనించినా భయం, బాధ గా అనిపిస్తుంది. పిల్లలపై అరవడం లైంగిక లేదా శారీరక వేధింపుల వలె వారికి హానికరం. దుష్పరిణామాలు
బాల్యంలో పిల్లలపై అరవడం వల్ల ఆ శబ్దానికి సరిగా వినకపోవడం, అర్థం కాకపోవడం, బిత్తర చూపులు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దౌర్జన్యశీలత, క్రమశిక్షణా రాహిత్యం, ఒంటరిగా ఉండటం, నెర్వస్‌ నెస్‌, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ గణనీయంగా తగ్గుతుంది. మనమంతా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది.
పిల్లలపై శబ్ద దుర్వినియోగం ప్రభావం
బాల్య శబ్ద దుర్వినియోగంలో అత్యంత సాధారణ నేరస్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అని ఒక అధ్యయనంలో తేలింది. అరుపు యొక్క కొన్ని ప్రభావాలు పిల్లల్లో జీవితాంతం ఉంటాయి. సరిగ్గా చదువుకోవడం , ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. వచ్చిన జవాబులను పరీక్షలలో రాయలేకపోవడం కూడా జరుగుతుంది.
”అంతర్లీన భావోద్వేగ, మానసిక పరిణామాలను” సష్టించగలదు, ఇందులో ఊబకాయం, కోపం, మాదకద్రవ్య దుర్వినియోగం, నిరాశ, స్వీయ-హాని వంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి.
శబ్ద దుర్వినియోగాన్ని అర్థం చేసుకోవడం
ప్రస్తుతం పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు శారీరక వేధింపులు, లైంగిక వేధింపులు, భావోద్వేగ దుర్వినియోగం, నిర్లక్ష్యం. బాల్య భావోద్వేగ దుర్వినియోగం గతంకంటే ఈ మధ్య కాలంలో పెరిగింది.
శబ్ద దుర్వినియోగం
ఎక్కువ శబ్దాన్ని కూడా ఒక రకమైన దుర్వినియోగంగా గుర్తించారు. ఈ శబ్దాన్ని నిరోధించడం కోసం ‘ప్రారంభ స్థానం’ అని పరిశోధకులు నిర్ధారించారు. పిల్లలతో మౌఖిక సంభాషణ సమయంలో భద్రత, మద్దతు, పోషణ ప్రాముఖ్యతపై వయోజన శిక్షణ అవసరమని వీరు సూచిస్తున్నారు. జీవితకాల ప్రతికూల పరిణామాల కారణంగా బాల్య శబ్ద దుర్వినియోగాన్ని దుర్వినియోగ రకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
మెరుగైన ప్రత్యామ్నాయాలు
పిల్లలకు ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను బోధిస్తూ వారితో సానుకూల, ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో అరవడం కంటే చాలా మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మీ పిల్లల ప్రవర్తన మిమ్మల్ని నిరాశపరిచినప్పుడు కూడా మీ ప్రశాంతతను కాపాడుకోండి. మీ పిల్లలు మీ అంచనాలు, నియమాలను అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి. వారి నుండి ఏమి ఆశిస్తున్నారో వారికి తెలిసినప్పుడు, వారు అనుసరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కొన్నిసార్లు పిల్లలకు సమయం ఇవ్వడం వల్ల వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇది వారి ప్రవర్తనను ప్రతిబింబించే అవకాశాన్ని ఇస్తుంది. ‘నేను’ అనే పదాన్ని ఉపయోగించి మీ భావాలను, ఆందోళనలను పిల్లలకు వ్యక్తపరచండి. ఉదాహరణకు, ”బొమ్మలను విసిరేసినప్పుడు నేను నిరుత్సాహానికి గురవుతున్నాను” కాకుండా ”నీవు ఎప్పుడూ బొమ్మలను అలా విసరలేదుగా!” అని మంచి ప్రవర్తనను ప్రోత్సహించడానికి ప్రశంసించండి. ప్రతిఫలమివ్వండి. శిక్ష కంటే సానుకూలత మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మీరు ఆ పరిస్థితిలో ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీ టోన్‌ ఎంత పదునుగా ఉంటుందో ఆలోచించండి.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

Spread the love