గోదావరిలో పడి యువకుడు మృతి

అ కళ్యాణ్‌ మృతి పై అంతుచిక్కని అనుమానాలెన్నో
అ విచారణ చేసి న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఉజ్వల భవిష్యత్‌కు మార్గం వేసుకోవాల్సిన ఆ యువకుడు గోదావరిలో పడి ఎందుకు చనిపోవాలి అనుకున్నాడు. ఎంఎస్సీ కెమిస్ట్రీ సెకండియర్‌ వరకు చదువుచున్న చల్లా కళ్యాణ్‌ (22) ఉద్యోగ వేట కోసం రెండు రోజుల్లో హైదరబాద్‌కు వెళ్లేందుకు సర్వం సిద్దం చేసుకుని తను తీసుకున్న నిర్ణయం మార్పు వెనుకు అంతర్యం ఏమిటి. ఈ నెల 17న అనగా బుధవారం రాత్రి తోటి స్నేహితులతో సరదాగా గడిపి ఇంటికి వచ్చిన కళ్యాణ్‌ రాత్రికి రాత్రే ఈ నిర్ణయం తీసుకోవడం వలన బలమైన కారణం ఎమైనా ఉందా..ఇలా కళ్యాణ మృతి పై అంతు చిక్కని అనుమానాలెన్నో ప్రశ్నలు వేస్తున్నాయి. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే తప్ప నిజాలు నిగ్గు తేలే అవకాశం ఉంది అనే చెప్పవచ్చు.
మండలంలోని సున్నంబట్టి గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరావు, ప్రమీళ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా పెద్ద కుమారుడు నవీన్‌. రెండవ కుమారుడు ప్రవీణ్‌లకు వివాహం అయింది. మూడవ కుమారుడు చల్లా కళ్యాణ్‌ భద్రాచలంలో ఎంఎస్సీ కెమిస్ట్రీ సెకండియర్‌ విద్యను అభ్యశిస్తున్నాడు. కళ్యాణ చదువులతో పాటు ఆట పాటల్లో ముందుంటూ తన తండ్రిక వ్యవశాయ పనుల్లో తోడుగా ఉంటాడు. ఎటువంటి చెడు అలవాట్లు లేని కళ్యాణ్‌ ఈ నెల 17వ తేదీ సాయంత్రం సమయంలో తన స్నేహితులతో కలసి క్రికెట్‌ ఆట కోసం బైరాగులపాడు గ్రామం వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి తన అన్నయ్య ప్రవీణ్‌తో కలసి అన్నం తిని ఆరు బయట పడుకున్నాడు. కాగా కళ్యాణ్‌ పెద్ద అన్నయ్య నవీన్‌ పెళ్లికి వెళ్లగా తల్లి దండ్రులు శ్రీనివాసరావు, ప్రమీళలు జెడ్‌ వీరభద్రాపురం గ్రామంలో చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తూ అక్కడే ఉంటున్నారు. కళ్యాణ్‌ ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌ వెళ్లి అక్కడ ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేందుకు అన్ని సిద్దం చేసుకున్నాడు. కళ్యాణ్‌ ఆరు బయట పడుకుని లైట్‌ వెళుతురులో ఉండి ఫోన్‌ మాట్లాడుతున్న సమయంలో రెండవ అన్నయ్య లైట్‌ ఆర్పి వేసి పడుకోమని చెప్పగా ఇంట్లోకి వెళ్లి పడుకున్నట్లు తెలిసింది. ఫోన్‌ ఇంట్లో పెట్టి గురువారం ఉదయమే బయటకు వెళ్లాడు అనుకుంటున్న కళ్యాణ్‌ 10 గంటల సమయం వరకు కనపడక పోవడంతో స్నేహితుల వద్ద కుటుంబ సభ్యులు ఆరా తీశారు. కాని కళ్యాణ్‌ అచూకి లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం చేపల వేట కోసం వెళ్లిన జాలర్లకు కళ్యాణ్‌ గోదావరిలో తేలాడుతూ శవమై కనిపించాడు. వెంటనే వారు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కళ్యాణ్‌ మృత దేహాని బయటకు తీసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు తన కుమారుడి మృతి పై పూర్తి స్థాయి విచారణ చేసి తమకు న్యాయం చేయాలంటూ మృతుడి తండ్రి చల్లా శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కేశవ్‌ శవానికి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణ్‌ మృతితో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. తన స్నేహితుడిని కోల్పోయాం అంటూ మిత్రులు కన్నీటి పర్వంతం అయ్యారు.

Spread the love