రేపు అంబేద్కర్‌ వర్సిటీలో స్పెషల్‌ బీఎడ్‌ స్పాట్‌ అడ్మిషన్లు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం జరగనుంది. ఈ మేరకు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ ఎల్వీకే రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు స్పాట్‌ అడ్మిషన్లకు కావాల్సిన అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తేవాలని సూచించారు. వర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాసి అందులో ర్యాంకు పొందిన వారే హాజరు కావాలని కోరారు. ఖాళీగా ఉన్న సీట్లు, ఇతర వివరాలకు షషష.bతీaశీబ.aష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Spread the love