సెనెగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్
ఆఫ్రికా దేశం సెనెగల్‌లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గాడిదను తప్పించబోయి బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి మృతికి ఆ దేశ అధ్యక్షుడు మాకీ సాల్ సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. సెనెగల్‌లోని ఉత్తరాన నెగున్ సార్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్ ట్వీట్ చేస్తూ.. మా రోడ్లపై మరో ఘోర ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. బస్సు, ట్రక్కు ఢీకొన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. గత వారం సెనెగల్‌లోని కాఫ్రైన్ ప్రాంతంలోని గనివి గ్రామంలో జరిగిన బస్సు ప్రమాదంలో 40 మంది మరణించారు. ఆ ప్రమాదం తర్వాత రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.

Spread the love