రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి

మొరాకో : ఆఫ్రికాలోని మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొరాకోలోని అజిలాల్‌ సెంట్రల్‌ ప్రావిన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. డెమ్నాట్‌ పట్టణంలోని వీక్లీ మార్కెట్‌కు ప్రయాణికులను తీసుకెళ్తున్న మినీబస్సు బోల్తా పడడంతో వారు మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Spread the love