2021  ఉప ఎన్నిక తెచ్చిన చేటు

 – పొద్దంతా పార్టీ ప్రచారాలు, తెల్లం దాకా బుజ్జగింపులు

 – వాళ్ళిద్దరు కొట్టుకుంటే నేను గెలుస్తా… ఎవరి ధీమా వారిదే
నవతెలంగాణ- జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రధానంగా బీఆర్ఎస్  అభ్యర్థిగా ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వొ డి త లప్ర ణ వ్ బాబు , బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి , ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున పల్లె ప్రశాంత్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారము, పోటీ ఉంది. 2021 లో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు, సీఎం కేసీఆర్ కు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయో ఇప్పటివరకు అసలు విషయం వారిద్దరూ కూడా నోరు మెదపలేదు. అసైన్డు భూములను ఈటెల ఆక్రమించాడు అనే పేరుతో మాత్రమే బయటికి పంపించారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈటెల బయటకు రావడం తదనంతరం బీజేపీ పార్టీలో చేరడం, ఆ పార్టీ తరఫున 2021 లో పోటీ చేయడం, ఆ పోటీని సీఎం కేసీఆర్ అతి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, యంత్రాంగం హుజురాబాద్ నియోజకవర్గం లో ఉండి, బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ను ఓడించడానికి తన సర్వశక్తులను ఉపయోగించాడు అనడంలో ఎలాంటి సంశయము, సందేహం లేదు. అప్పటివరకు వాస్తవంగా నియోజకవర్గము ఏర్పడినప్పటి నుండి అసెంబ్లీ ఎన్నికలలో డబ్బుల పంపిణీ కానీ మధ్యముపంపిణి గాని చేసిన సందర్భము చాలా తక్కువ . 2023 జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా2021 ఉప ఎన్నిక లాగానే డబ్బుల పంపిణీ ఉంటుందని నియోజకవర్గం లో ఉన్నటువంటి కొంతమంది ఊహించుకొని ఉన్నారు. ఏది ఏమైనా నోటుకు ఓటు పోయి స్వచ్ఛందంగా సమాజానికి నిస్వార్ధంగా, నిజాయితీగా, అవినీతి లేకుండా అక్రమార్చన లేకుండా ఉండేటువంటి వ్యక్తి కి ఓటు వేసి గెలిపించుకునేటువంటి గొప్ప ఆయుధము ఓటు. ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటును సద్వినియోగం చేసుకొని వేస్తే సమాజాభివృద్ధి జరుగుతుంది. తాత్కాలిక ప్రయోజనాలను అంటే మధ్యము, డబ్బులకు, లేదా దగ్గర, కులము, మతము, తెలిసినవాడు అని, సమాజ సేవ చేయకుండా స్వార్థపరునికి ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు వాడు చేసే దుర్మార్గాలను, దౌర్జన్యాలను, అక్రమాలను, అవినీతిని, భూ కబ్జాలను భరించాల్సిందే.
అలకలు: నియోజకవర్గంలో వీణవంక, జమ్మికుంట, హుజురాబాద్, ఇల్లందకుంట, కమలాపూర్ ఐదు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల సీనియర్ నాయకులు అలకభూని పార్టీ ఆదేశాను సారము పనిచేయకుండా ఇంట్లో ఉండి అలక భూనారు.
బుజ్జగింపులు: కొంతమంది ప్రజాప్రతినిధులు ,ఆయా పార్టీల సీనియర్ నాయకులు ఏదో ఓ సందర్భంలో మనసు నో  చ్చు కొని లేదా తమ కంటే జూనియర్లకు  లేదా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అలిగి ఇంట్లో ఉండగా వారందరి లిస్ట్ తీసుకొని బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టారు.
ఓదార్పు: ఉదయమంతా పార్టీల ప్రచారం చేస్తూ రాత్రంతా అలిగిన నాయకులను, ప్రజాప్రతినిధులను ఓదార్చుతూ నేను మీకున్న ,నన్ను గెలిపించండి. నేను గెలిస్తే రాబోయే ఎన్నికల్లో ఈ పదవిలో పెట్టి గెలిపిస్తా లేదా ఫలానా నామినేట్ పదవి ఇస్తానని హామీ లిస్టు ఓదార్చుతున్నట్టు సమాచారం.
విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ: 2021 హుజురాబాద్ ఎన్నిక సందర్భంగా విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని ఒక పార్టీపై, మరొక పార్టీ ఆరోపణలు చేసుకున్నారు. మధ్యము ఏరులై పారింది. భారతదేశంలోని అతి ఖరీదైన ఎన్నికగా పేరుంది.
నాయకుల స్థాయిని బట్టి రేటు: 2021 ఉప ఎన్నిక లో నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు స్థాయిని రేటు నిర్ణయించి డబ్బుల పంపిణీ యదేచ్చగా పంపిణీ చేసినట్లు సమాచారం. 2023 నవంబర్లో జరిగే ఎన్నికల్లో కూడా ఆ పరిస్థితి పునరావృతం అవుతుందని కొంతమంది నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఎన్నిక గుణపాఠంగా తీసుకొని ఆయా రాజకీయ పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థులు అందుకు భిన్నంగా డబ్బుల పంపిణీ చేయకపోవడంతో ఆశలు పెంచుకున్నటువంటి నాయకులు ఎప్పుడు ఆయా పార్టీల నుండి పిలుపు  వస్తుందోనని ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
ప్రచార తీరు: ప్రధానపార్టీలైన  బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు వారి గెలుపునే ద్యేయంగా ప్రచారం చేస్తున్నారు. వారి వారి పార్టీల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో ఉంటూ సమాజ సేవ చేస్తామని హామీలు ఇస్తున్నారు.
ప్రభుత్వ లబ్ధిదారులు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వ లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ వీరందరి ఓటు ఏ పార్టీకి పడుతుందనే చర్చ నియోజకవర్గంలో కొనసాగుతుంది.
Spread the love