Wednesday, May 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేటీఆర్‌ తీరు మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తాం

కేటీఆర్‌ తీరు మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తాం

- Advertisement -

– అంతర్రాష్ట్ర దొంగలతో సీఎంకు లింకు పెడతావా..? : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌
నవతెలంగాణ-కరీంనగర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ తన నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తగిన బుద్ధి చెబుతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హెచ్చరించారు. కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ షాపులో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడిన బాధితులను మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం కరీంనగర్‌ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్‌ కాల్పుల ఘటన దురదృష్టకరమని, అంతర్రాష్ట్ర దొంగల ముఠా పక్కా స్కెచ్‌తో ఈ దోపిడీకి పాల్పడిందని అన్నారు. నిందితులను పట్టుకునేందుకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నామని వివరించారు. బాధితులకు పరామర్శ పేరుతో వచ్చిన కేటీఆర్‌.. అంతర్రాష్ట్ర దొంగలను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రితో పోల్చడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన దోపిడీలు, హత్యలకు నాటి సీఎం కేసీఆర్‌ బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. జ్యువెల్లరీ షాపు కాల్పుల బాధితులను కాంగ్రెస్‌ నేతలు పరామర్శించలేదని కేటీఆర్‌ అనడం అబద్ధమని, ఘటన జరిగిన రోజే సుడా చైర్మెన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వెలిచాల రాజేందర్‌రావు తదితరులు పరామర్శించారని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజరుకి దమ్ముంటే కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో కేసీఆర్‌, కేటీఆర్‌కు నోటీసులు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సుడా చైర్మెన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వెలిచాల రాజేందర్‌రావు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -