- Advertisement -
బీరుట్/జెరుసలేం : హిజ్బొల్లా – ఇజ్రాయిల్ మధ్య పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని లెబనాన్ ప్రకటించింది. అయితే ఈ పరిమిత ఒప్పందం కారణంగా ఘర్షణలకు ముగింపు జరగదని వాషింగ్టన్‌లోని లెబనాన్ రాయబార కార్యాలయం తెలిపింది. హిజ్బొల్లా నియంత్రణలో ఉన్న బీరుట్, దాని శివారు ప్రాంతాలపై దాడులు జరపవద్దని ఇజ్రాయిల్‌కు సూచించింది. హిజ్బొల్లా కూడా ఇజ్రాయిల్‌పై దాడులు ఆపేస్తుందని చెప్పింది. కాగా లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ సేనలు వైదొలిగితేనే పూర్తి స్థాయి కాల్పుల విరమణను సమర్ధిస్తామని హిజ్బొల్లా ప్రతినిధి హసన్ ఫద్లల్లా స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లో బుధవారం చర్చలు జరిగినప్పుడు కాల్పుల విరమణను పొడిగించాలని కోరతామని లెబనాన్ తెలియజేసింది.
- Advertisement -



