Sunday, June 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పర్యటించిన డీజీపీ

భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పర్యటించిన డీజీపీ

- Advertisement -

నవతెలంగాణ ప్రత్యేక-ప్రతినిధి
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలను 
రాష్ట్ర డీజీపీ సీవి ఆనంద్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా పర్యటించా రు. ముఖ్యంగా టోలీ చౌకీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో రోడ్ల్ పై భారీగా నిలిచిపోయిన నీళ్లను ఆయన పరిశీలించారు. వర్షం వల్ల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటాన్ని గమనించిన డీజీపీ ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి అదనంగా సిబ్బందిని నియమించాలని సైబరాబాద్ సీపీ రమేష్ ను ఆదేశించారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ కమిషనరేట్ లోని వివిధ ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా అదనంగా సిబ్బందిని నియమించాలని, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -