రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన ‘టాక్ ‘
నవతెలంగాణ-హైదరాబాద్
బ్రిటన్లోని లండన్లో భారత హైకమిషన్ ఆధ్వర్యంలో “తెలంగాణ డే” వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్ని సెంట్రల్ లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో చేపట్టారు. యూకేలోని వివిధ ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే (TAUK) సంస్థ తెలంగాణ కు ప్రాతినిధ్యం వహించింది. చుర్రుగ్గా పాల్గొనడమే కాకుండా తెలంగాణ సంస్కృతి ప్రతిభింబించేలా ప్రత్యేక నృత్య ప్రదర్శన, హాజరైన అతిధులకు టాక్ ఆద్వర్యంలో హైదరాబాద్ బిర్యానీని రుచి చూపించారు.ఈ కార్యక్రమంలో ముందుగా లండన్ లోని భారత హైకమిషనర్ పెరియసామి కుమారన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు, ప్రవాసులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపి, ప్రవాసుల్లో ఐక్యత, విదేశీ గడ్డపై భారత సంస్కృతిని ప్రచారం చెయ్యడానికి వివిధ రాష్ట్రాల , సాంస్కృతిక గీతాలకు అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బతుకమ్మ ప్రదర్శన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. భారత హైకమీష్నర్ పెరియసామి కుమారన్ టాక్ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తూ టాక్ సంస్థ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా అటు సాంస్కృతిక కార్యక్రమాలల్లో అతిధులకు బిర్యానీ తో అసలైన తెలంగాణ సంప్రదాయాన్ని చూపించారని తెలిపారు.
టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ లండన్ లోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న “తెలంగాణ డే” వేడుకల్లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని, నాడు టాక్ వ్యవస్థాపకుడు , తెలంగాణ ఉద్యమ నాయకుడు అనిల్ కూర్మాచలం నాయకత్వంలో ఇదే భారత హైకమిషన్ ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ కేసీఆర్ పిలుపు మేరకు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశామన్నారు. నేడు అదే భారత హైకమిషన్ కార్యాలయంలో అధికారికంగా తెలంగాణకు ప్రాతి నిధ్యం వహించడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసిన భారత హైకమిషన్ కార్యాలయానికి అధికారులకు, హాజరై సహకరించిన టాక్ సభ్యులకు ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు కృతఙతలు తెలిపారు.టాక్ సంస్థ కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్పర్సన్ గణేష్ కుప్పలా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను వివరిస్తూ, తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని, టాక్ సంస్థ చేస్తున్న సేవలను ఈ వేడుకల్లో భారత సంతతికి చెందిన తెలంగాణ వాస్తవ్యులు లార్డ్ ఉదయ్ నాగరాజు, టాక్ సంస్థ ప్రతినిధులు రత్నాకర్ కడుదుల, గణేష్ కుప్పలా, నవీన్ రెడ్డి, సురేష్ బుడగం, సుప్రజ పులుసు, స్వాతి, అబ్దుల్ ఖుద్దూస్, నవ్య కుప్పాల ,కుమారి తన్మయ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.
లండన్ భారత హైకమిషన్ లో ‘తెలంగాణ డే’ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



