Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విజయవంతంగా 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు

విజయవంతంగా 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు

- Advertisement -

– యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ అరుదైన ఘనత
నవతెలంగాణ – కామారెడ్డి

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ కిడ్నీ చికిత్స విభాగం అరుదైన మైలురాయిని అధిగమించింది. ప్రముఖ నెఫ్రాలజిస్టులు డాక్టర్ రాజశేఖర చక్రవర్తి, డాక్టర్ పి. విజయ్ వర్మల నేతృత్వంలోని వైద్య బృందం ఇప్పటి వరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి, వందలాది మంది రోగులకు నూతన జీవితాన్ని అందించింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్ బ్రాంచ్ లొ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైద్య నిపుణులు కిడ్నీ మార్పిడి రంగంలో తాము సాధించిన పురోగతిని వివరించారు. సాధారణంగా కిడ్నీ మార్పిడికి దాత, గ్రహీతల రక్త గ్రూపులు సరిపోవడం అవసరమని, అయితే యశోద హాస్పిటల్స్ వైద్య బృందం రక్త గ్రూపులు వేర్వేరుగా ఉన్న రోగులకు కూడా (ABO-Incompatible Kidney Transplantation) విజయవంతంగా కిడ్నీ మార్పిడి నిర్వహించి, వారికి ఆరోగ్యకరమైన జీవితం అందించడంలో సఫలమైందని తెలిపారు.

వయస్సు చికిత్సకు అడ్డంకి కాదని నిరూపిస్తూ, 60 ఏళ్లు దాటిన వృద్ధులలో కూడా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ విజయాలను సాధించినట్లు పేర్కొన్నారు. డాక్టర్ పి. విజయ్ వర్మ మాట్లాడుతూ, “కిడ్నీ వైఫల్యంతో బాధపడే రోగులకు డయాలసిస్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కిడ్నీ మార్పిడి ద్వారా రోగుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి. మేము నిర్వహించిన 381 ట్రాన్స్‌ప్లాంట్లు కేవలం సంఖ్య మాత్రమే కాదు, 381 కుటుంబాల్లో వెలుగులు నింపిన విజయగాథలు. రక్త గ్రూపులు వేరైనా కిడ్నీ మార్పిడి సాధ్యమే అనే అవగాహన ప్రజల్లో పెరగాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ కిడ్నీ సంబంధిత వ్యాధులకు అంతర్జాతీయ ప్రమాణాలతో చికిత్సలు అందిస్తూ దేశంలోనే ప్రముఖ ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రంగా ఎదుగుతోందని వైద్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -