Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై మోటివేషన్

విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై మోటివేషన్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని పీఎం శ్రీ చౌటుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేర ఆంధ్రయ్య ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ పై మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటివేటర్, సైకాలాజిస్ట్ తిరునగారి శ్రీహరి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించారు.

 విద్యార్థులు కెరీర్ గైడెన్స్ తో పాటు, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల ఉంచుకోవలసిన విలువల గురించి వివరించారు. గొప్ప చదువులు చదివి భవిష్యత్తులో మంచి స్థాయిలోకి రావాలని సూచిస్తూ  తన మాటల ద్వారా, చిన్న చిన్న గేమ్స్ పెడుతూ పిల్లల్ని మంత్రముగ్ధుల్ని చేసి విద్యార్థుల మనస్సులను చురగొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో పైకేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, అందిపుచ్చుకోవాల్సిన అవకాశాల గురించి క్షుణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే. శ్రీనివాస్, రమేష్, ఏ. శ్రీనివాస్, బంతిలాల్, రాజు, నగేష్, మధుబాబు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -