– కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రశాంత్ రెడ్డి మీకు రైతుల తరపున మాట్లాడే కనీస అర్హత కూడా లేదనీ కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొండి 9 ఏళ్ల మీ దుర్మార్గ పరిపాలనలో రైతులను ఎన్ని గోసాలు పెట్టారో, మా రైతులు ఎన్ని అవస్థలు పడ్డారో ఇంకా మర్చిపోలేదన్నారు.పంటలు ఎండిపోతున్నాయి కనీసం లీకేజీ నీళ్లు అయినా ఇవ్వండి అని రైతులు రోడ్డెక్కితే మహిళా రైతులని కూడా చూడకుండా కేసులు పెట్టిన చరిత్ర ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన బద్దం రజిత అనే మహిళ రైతుపై నువ్వు కేసులు పెట్టించావు, కొంతకాలం క్రితం ఆమె గుండెపోటుతో మరణించిందనీ, మీరు చేసిన పాపం కడుక్కుంటే పోతుందా ప్రశాంత్ రెడ్డి అని నిలదీశారు.మీ ఏలుబడిలో ఎంతోమంది రైతులపై కేసులు పెట్టించావు? వాళ్లు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టు తిరిగారన్నారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పేరు సంపాదించిందన్నారు. ఇప్పుడు మీ కండ్లు మండి కడుపులో విషం పెట్టుకుని ప్రభుత్వం మీద దుష్ప్రప్రచారం చేస్తున్నావ్ అన్నారు.
రైతులతో కాకుండా నీ పార్టీ కార్యకర్తలతో రోడ్డు మీదికి వచ్చి నానా అంగడి సృష్టించి, ప్రజలను ఇబ్బంది పెట్టి రైతుల కోసం పోరాడితే కేసులు పెట్టారా? అని ప్రశ్నించారు. ప్రశాంత్ రెడ్డి అన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నావ్ అని విమర్శించారు.నిన్ను నమ్మే పరిస్థితుల్లో బాల్కొండ నియోజకవర్గ రైతాంగం లేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా రైతులకు శ్రీరామరక్ష అని సునీల్ రెడ్డి స్పష్టం చేశారు.



