అలర్ట్‌గా ఉండాలని ఈసీ సూచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు, కాల్స్ వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందనీ, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల గుర్తింపు కార్డులు, ఎన్యూమరేషన్ నమోదు ఫారంలోని వివరాలు సరిపోక ఓటు తిరస్కరించబడిందని వచ్చే సందేశాలకు ఎలాంటి సమాధానం ఇవ్వొద్దని పేర్కొన్నారు. ఒక నెంబర్‌కు కాల్ చేయాలని లేదా వాట్సాప్ ద్వారా పంపిన లింక్ ఫారంను నింపి, నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా రూ. 5 చెల్లించాలని కోరుతున్నారని గుర్తు చేశారు. అలాగే లాగిన్ వివరాలు, పాస్వర్డ్, సీవీవీ నెంబర్, ఏటీఎం పిన్ వంటి బ్యాంక్ వివరాలను ఎవరితో పంచుకోవద్దని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా గాని తెలంగాణ ఎన్నికల కార్యాలయం గాని ఎలాంటి సందేశాలను పంపదని స్పష్టం చేశారు. అటువంటి సందేశాలు లేదా కాల్స్ వస్తే, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
సర్ పేర మోసపూరిత మెసేజ్‌లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



