– ‘ఇంజనీర్స్ డే’లో పాల్గొన్న డైరెక్టర్
నవతెలంగాణ-సత్తుపల్లి
సింగరేణి సత్తుపల్లి ఏరియా బొగ్గు గనుల ప్రాంతాలను ఆ సంస్థ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ (పీపీ) డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు ఏరియా జీఎం సరికొండ వెంకటాచారితో కలిసి మంగళవారం సందర్శించారు. బొగ్గు గనుల ప్రాంతాల సందర్శన అనంతరం స్థానిక ఏరియా జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘ఇంజనీర్స్ డే’ (మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి) వేడుకలో డైరెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొని విశ్వేశ్వరయ్య చిత్రపటానికి జీఎం వెంకటాచారితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం వెంకటాచారి మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమైనదని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జీఎం శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (కిష్టారం ఓసీ) ఎ.ఎల్.ఎస్.వి. సునీల్ వర్మ, జేవీఆర్ సీహెచ్పీ ఎస్ఈ సాయినాథ్, కొనుగోళ్ల అధికారి ఎం. మోహన్, ఎస్ఓఎం (కిష్టారం ఓసీ) బి. రామకృష్ణ, పర్సనల్ మేనేజర్లు ఎల్. తిరుపతి, ఎం. మురళి, ఏరియాలోని ఇతర అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సత్తుపల్లి సింగరేణి ఏరియాను సందర్శించిన డైరెక్టర్ కొప్పుల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



