- Advertisement -
కాటారం సబ్ కలెక్టర్ సౌరబ్ శర్మ
నవతెలంగాణ – మల్హర్ రావు
రెవెన్యూ, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని కాటారం సబ్ కలెక్టర్ సౌరబ్ శర్మ ఆదేశించారు. ఇటీవల సబ్ కాల్ గా బాధ్యతలు చేపట్టిన మొదటిసారిగా మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల తహశీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోజువారీ హాజరు రిజిస్టర్, భూములకు సంబంధించిన రికార్డులు తనిఖీలు చేపట్టారు. సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భూ సమస్యల పరిస్కారంలో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్, తాడిచెర్ల జిపిఓ గొట్టం నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



