సరికొత్త గ్రామీణ నేపథ్య కథ

సరికొత్త గ్రామీణ నేపథ్య కథయువ చంద్ర కష్ణ హీరోగా సాహిత్‌ మోత్కూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘పొట్టేల్‌’. గ్రామీణ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌కి మంచి స్పందన లభించగా, పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. తాజాగా మేకర్స్‌ టీజర్‌ అప్డేట్‌తో వచ్చారు. ఈ చిత్రానికి సంబంధించి పవర్‌ఫుల్‌ టీజర్‌ ఈనెల 18న విడుదల చేస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్‌ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్‌ కుమార్‌ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల కథానాయిక.
అజరు, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్‌ సీన్‌, చత్రపతి శేఖర్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, జీవన్‌, రియాజ్‌, విక్రమ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు – నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్‌ కుమార్‌ సడిగె, సంగీతం- శేఖర్‌ చంద్ర, సినిమాటోగ్రాఫర్‌ – మోనిష్‌ భూపతి రాజు, ఎడిటర్‌ – కార్తీక శ్రీనివాస్‌, లిరిక్స్‌ – కాసర్ల శ్యామ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ – నార్ని శ్రీనివాస్‌, ఫైట్స్‌ – పథ్వీ, రబిన్‌ సుబ్బు.

Spread the love