రెండు అద్భుత ప్రపంచాల కలయిక

వైజయంతీ మూవీస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రానికి అధికారికంగా ‘కల్కి 2898 ఎడి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సి.అశ్వని దత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక శాన్‌ డియాగో కామిక్‌-కాన్‌లో ఈ చిత్ర గ్లింప్స్‌ని గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. సినిమా విజన్‌ కాన్సెప్ట్‌, స్పెల్‌ బౌండింగ్‌ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకర్షించింది.
అమితాబ్‌ బచ్చన్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఒక అసాధారణమైన, అద్భుతమైన అనుభవం. దీని వెనుక గొప్ప పరిశోధన ఉంది’ అని తెలిపారు. ‘ఈ సినిమాకి పెద్ద విజన్‌ ఉంది’ అని కమల్‌ హాసన్‌ అన్నారు. ‘అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, నా స్నేహితుడు ప్రభాస్‌ని చేరుకోవడానికి 50 సంవత్సరాలు కష్టపడ్డాను. ఇది మాకు చాలా గర్వకారణం’ అని నిర్మాత అశ్వని దత్‌ అన్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.

Spread the love