హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌సుధీర్‌ బాబు తాజాగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హరోం హర’. ‘సెహరి’ ఫేమ్‌ జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌) బ్యానర్‌పై సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ఈ సందర్భంగా సెట్‌లో కేక్‌ కట్‌ చేసి చిత్రబందం సెలబ్రేట్‌ చేసుకుంది. వీడియోలో టీమ్‌ సంతప్తిగా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే హరోం హర కథలో సుధీర్‌ బాబు కుప్పం యాసలో డైలాగులు చెప్పనున్నారు. ది రివోల్ట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఇందులో సుధీర్‌ బాబుకు జోడిగా మాళవిక శర్మ నటిస్తోంది. సునీల్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – జ్ఞానసాగర్‌ ద్వారక, నిర్మాత – సుమంత్‌ జి నాయుడు, సంగీతం – చైతన్‌ భరద్వాజ్‌, డీవోపీ – అరవింద్‌ విశ్వనాథన్‌, ఎడిటర్‌ – రవితేజ గిరిజాల.

Spread the love