జపాన్‌లో భారీ భూకంపం..

నవతెలంగాణ-హైదరాబాద్ : జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ జపాన్‌లోని ఎహైమ్, కొచ్చి ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి 6.4తీవ్రతతో భూకంపం వచ్చినట్టు ఆ దేశ వాతావరణం సంస్థ తెలిపింది. జపనీస్ దీవులైన క్యుషు, షికోకులను వేరుచేసే జలసంధి బుంగో ఛానల్ కేంద్రంగా భూకంప కేంద్రం నమోదైనట్టు వెల్లడించింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. సునామీ హెచ్చరికలు సైతం అధికారులు జారీ చేయలేదు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎహైమ్‌లో ఎలక్ట్రిక్ పవర్‌కు సంబంధించిన ఇకాటా అణు కర్మాగారం, ఒక రియాక్టర్ పని చేస్తుండగా..దానికి ఎటువంటి నష్టం జరగలేదని జపాన్ ప్రభుత్వ ప్రతినిధి యోషిమాసా హయాషి తెలిపారు. మరోసారి భూకంపం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Spread the love