అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య..

నవతెలంగాణ-గద్వాల్‌: జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గద్వాల్‌ పట్టణం భీనంగర్‌ కాలనీలో నివాసముంటున్న వివాహిత జయలక్ష్మి(40) ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు ఉదయం ఆమె ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జయలక్ష్మి రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికినట్లు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Spread the love