కవయిత్రి ప్రణవికి అరుదైన అవకాశం

నవతెలంగాణ – కంటేశ్వర్

నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ కవయిత్రి మాదాస్త ప్రణవికి అరుదైన అవకాశం లభించింది. ఆమె రచించిన తొలి కవితా సంపుటి  పాలకంకులు  పుస్తకాన్ని డాక్టర్ సి.నారాయణరెడ్డి సతీమణి పేరుట ఏర్పాటు చేసిన సుశీలా నారాయణరెడ్డి స్మారక ట్రస్టు ప్రచురించి ఈ నెల 27న తెలంగాణ సారస్వత పరిషత్తులో డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, తదితర ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నట్లు హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ బుధవారం తెలియజేశారు. మహిళలను సాహిత్య రంగంలో ప్రోత్సహించడానికి ట్రస్టు ప్రతి సంవత్సరం చక్కగా రాణిస్తున్న కవయిత్రుల పుస్తకాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ సంవత్సరానికి నిజామాబాద్ కు చెందిన మాదాస్త ప్రణవి రాసిన పాలకంకులు కవితా సంపుటి ఎంపిక కావడం పట్ల హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, గుత్ప ప్రసాద్, డాక్టర్ వి త్రివేణి, డాక్టర్ వెంకన్న  జ్యోతి, వి పి చందన్ రావు, పంచ రెడ్డి లక్ష్మణ్, కందాళై రాఘవాచార్య, గంట్యాల ప్రసాద్, దారం గంగాధర్, మద్దుకూరి సాయిబాబు తదితరులు ప్రణవిని అభినందించారు. గతంలో మాదస్త ప్రణవి హరిత రచయితల సంఘం యువ పురస్కారాన్ని, రోటరీ క్లబ్ యువ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నది.
Spread the love