ఏఐజి హాస్పిటల్‌లో అరుదైన చికిత్స

హమార్టోమా, రోబోటిక్‌ థర్మోఅబ్లేటివ్‌ డిస్‌కనెక్ట్‌ సర్జరీ విజయవంతం : వైద్యులు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
హైపోథాలమిక్‌ హమార్టోమా, డ్రగ్‌ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ ఉన్న పీడియాట్రిక్‌ రోగిపై రెయిన్‌బో హాస్పిటల్స్‌ వైద్యుల సహకారంతో జరిగింది. అద్భుతమైన వైద్య సాధనలో, డ్రగ్‌ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీతో హైపోథాలమిక్‌ హమార్టోమాతో బాధ పడుతున్న రోగికి భారతదేశంలో మొట్టమొదటి రోబోటిక్‌ థర్మో అబ్లేటివ్‌ డిస్‌కనెక్ట్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినందుకు ఏఐజీ హాస్పటల్స్‌కు గర్వంకారణమని ఆస్పత్రి వైద్య సిబ్బంది తెలిపారు. ఈ అత్యాధునిక ప్రక్రియ న్యూరోసర్జరీ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచి స్తుందనీ, ఈ సంక్లిష్ట నాడీ సంబంధిత పరిస్థితి ఉన్న రోగులకు కొత్త ఆశ అందిస్తుందన్నారు. హైపోథాలమిక్‌ హమార్టోమా అనేది మెదడులోని హైపోథాలమస్‌ ప్రాంతంలో ఉన్న అరుదైన, క్యాన్సర్‌ లేని కణితి లాంటి వైకల్యం జనాభాలో కొద్ది శాతం మందిపై మాత్రమే ప్రభావితం చేస్తుందన్నారు. డాక్టర్‌ రఘు మాట్లాడుతూ సామల కన్సల్టెంట్‌ ఎపిలెప్సీ, ఫంక్షనల్‌ న్యూరోసర్జరీ ప్రక్రియపై అవగాహన కల్పించారు. రోబోటిక్‌ సిస్టమ్‌ సర్జన్‌లకు పరిసర నాడీ నిర్మాణాల నుంచి హర్మోటోమాను ఖచ్చితంగా గుర్తించడం, డిస్‌కనెక్ట్‌ చేయడంలో మార్గనిర్దేశం చేసిందనీ, తద్వారా డ్రగ్‌-రెసిస్టెంట్‌ ఎపిలెప్సీకి దోహదపడే అసాధారణ సర్క్యూట్‌లకు అంతరాయం కలిగిస్తుందన్నారు. మొట్టమొదటి రోబోటిక్‌ థర్మోఅబ్లేటివ్‌ డిస్‌కనెక్ట్‌ సర్జరీ విజయవంతమైన ఫలితం హైపోథాలమిక్‌ హమార్టోమా, డ్రగ్‌ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ నిర్వహణలో పెద్ద పురోగతిని సూచిస్తుందని తెలిపారు. న్యూరోసర్జికల్‌ టీమ్‌ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ డాక్టర్‌, సుబోధ్‌ రాజు ఈ అద్భుతమైన విజయం తనకు ఉత్సాహానిస్తుందన్నారు. డాక్టర్‌ రాజు మాట్లాడుతూ సంక్లిష్ట శస్త్ర చికిత్సలు నిర్వహించిన జట్టు కృషిని అభినందించారు.

Spread the love