తాటి చెట్టు పైనుంచి పడి కార్మికుడు మృతి

నవతెలంగాణ- వలిగొండ రూరల్‌
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి జారిపడటంతో గీత కార్మికుడు ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గొల్నేపల్లి గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గీత కార్మికుడు కమ్మగోని స్వామి(58) తాటి చెట్టుపై కల్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు జారీ కింద పడ్డాడు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. స్వామి మృతదేహాన్ని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య గౌడ్‌ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. సంఘం మండల అధ్యక్షులు పబ్బతి మల్లేశం గౌడ్‌, ప్రధాన కార్యదర్శి గాజుల ఆంజనేయులు గౌడ్‌, కోశాధికారి పలుసం స్వామి గౌడ్‌, గ్రామ అధ్యక్షుడు కర్నాటి సైదులు గౌడ్‌, గంగాపురం నరసింహ, కాసుల సాయిలు, గంగాపురం కిష్టయ్య, గంగాపురం వెంకటేష్‌ గౌడ్‌ నివాళి అర్పించారు.

Spread the love