ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ-ఆర్మూర్
ముందస్తు అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్య సంస్థల పై తగు చర్యలు తీసుకోవాలి మరియు ఫీజు నియంత్రణ చట్టం తేవాలని పిడిఎస్యు నాయకులు- ప్రిన్స్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం మండలంలో విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్స్ నిర్వహిస్తూ ఇష్టరీతిగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్-ప్రైవేట్ విద్య సంస్థలు శ్రీ చైతన్య, నారాయణ, అల్ఫోర్స్, కృష్ణవేణి, బ్రిలియంట్ గ్రామర్ పాఠశాలలు నియమ నిబంధనలు పాటించకుండా ఇంటర్నేషనల్ టెక్నో వివిధ తోకల పేర్లతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను మబ్బె పెడుతూ అడ్మిషన్లు చేస్తున్నారు. జీఓ నెంబర్ 1ని తుంగలోకి తొక్కి అక్రమ అడ్మిషన్స్ చేస్తున్న పాఠశాలల పైన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా మండలంలో పలు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు నియమ నిబంధనలు పాటించకుండా పాఠశాలలు, కళాశాలలు నడుపుతున్నారుని వారి పైన వెంటనే షో-కేస్ నోటీసులు ఇచ్చి వారి గుర్తింపు రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో భౌతిక దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నిశాంత్, నాదీమ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love