విధుల్లో చేరిన ఆయిల్ఫెడ్ మేనేజర్ నాగబాబు

– ఫాం ఆయిల్ పరిశ్రమకు అదనపు మేనేజర్…
– విధుల్లో చేరిన మేనేజర్ నాగబాబు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ఆయిల్ఫెడ్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఆయిల్ ఫాం నూనె తయారీ పరిశ్రమకు సంస్థ అదనపు మేనేజర్ ను నియమించింది. దమ్మపేట మండలం అప్పారావుపేట పరిశ్రమలో డిప్యూటీ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న ఎం.నాగబాబు కు మేనేజర్ పదోన్నతి కల్పిస్తూ అశ్వారావుపేట పరిశ్రమకు అదనపు మేనేజర్ గా బదిలీ చేసారు. దీంతో ఆయన బుధవారం అశ్వారావుపేట లో విధుల్లో చేరారు. ఈ పరిశ్రమలో ఇప్పటికే మేనేజర్ గా పనిచేస్తున్న ఆకుల బాలక్రిష్ణ ఒకపక్క పరిశ్రమ పర్యవేక్షణ, మరో పక్క ఆయిల్ ఫాం కేంద్రీయ నర్సరీ నిర్వహణ, సాధారణ పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతేడాది నవంబర్ నుండి డివిజనల్ అధికారి లేకపోవడంతో బాలక్రిష్ణ సైతం బహు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మేనేజర్ గా పదోన్నతి పొందిన నాగబాబు ను అశ్వారావుపేట పరిశ్రమకు అదనపు మేనేజర్ గా నియమించడంతో బాలక్రిష్ణ పనిభారం తగ్గే అవకాశం ఉంది. విధుల్లో చేరిన నాగబాబు కు డి.ఒ బాలక్రిష్ణ,ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ రాధాక్రిష్ణ, మేనేజర్ (టెక్నికల్) వెంకటేష్, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love