నవతెలంగాణ – నిర్మల్
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మరో విద్యార్థిని మృతిచెందింది. పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న లిఖిత.. హాస్టల్ నాలుగో అంతస్తు పైనుంచి కిందపడింది. చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. రెండు రోజుల క్రితం గోపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.